Akhilesh Yadav | రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసానికి ఆహ్వానించారు.
ఈ మేరకు శనివారం సాయంత్రం అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్ లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు అఖిలేష్ యాదవ్‌కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సోదరులు, కుటుంబ సభ్యులను అఖిలేష్ యాదవ్‌కు పరిచయం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ వెంట ఉన్నారు.



Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో