మల్కాజిగిరి, నవంబర్ 14 : అభివృద్ధిపనులను అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy) అన్నారు. గురువారం మచ్చ బొల్లారం కౌకుర్లో రూ.68లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపనులకు కొందరు అడ్డుపడుతున్నారని తెలిపారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కొందరు రాజకీయాల కోసం ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న నీటిని అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చిల్లర రాజకీయాలుచేస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇక్కడఉన్న వాంబే గృహాలలో అక్రమంగా ఇండ్లను అమ్ముకునే వారు ఆపితే అభివృద్ధిపనులు ఆగవని స్పష్టం చేశారు.