Imane Khelif : పారిస్ ఒలింపిక్స్ నుంచి మీడియాలో మార్మోగిన పేరు ఇమనె ఖెలిఫ్ (Imane Khelif). వివాదాస్పద బాక్సర్‌గానే విశ్వక్రీడల్లో పసిడి పతకం కొల్లగొట్టిన ఇమనె మరోసారి వార్తల్లో నిలిచింది. అల్జీరియాకు చెందిన ఆమె పురుష లక్షణాలున్న బాక్సర్ అని అంతర్జాతీయ మీడియా మళ్లీ కోడై కూస్తోంది. ఫ్రాన్స్ జర్నలిస్ట్ ఒకరు ‘ఇమనె అమ్మాయి కాదు అబ్బాయి. అందుకు సాక్ష్యం ఇదుగో’ అంటూ కీలకమైన వైద్య పరీక్షల నివేదికను బహిర్గతం చేయడమే అందుకు కారణం. దాంతో, తనను కావాలనే ఇరుకున పెడుతున్నారంటూ సదరు జర్నలిస్ట్‌పై ఇమనె మండిపడింది.
తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమనె తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వాళ్లను కోర్టును ఈడుస్తానని హెచ్చరించింది. మీడియాలో తనపై వస్తున్న కథనాలు చూసి బాధగా ఉందని ఇంటర్వ్యూలో ఇమనె చెప్పింది. ‘నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఫ్రాన్స్ జర్నలిస్ట్‌తో పాటు మనమంతా కోర్టులో కలుద్దాం. అక్కడే తేల్చుకుందాం’ అని ఇమనె అంది.
Shouldn’t he/she meet the journalist in a hospital instead which can further establish the truth 😐#ImaneKhelif pic.twitter.com/1Q4l4xjRBs
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 14, 2024
ఇక నిజానిజాలు తెలియకుండా తనపై ఆరోపణుల చేస్తున్న ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలొనీపై కూడా ఈ అల్జీరియా బాక్సర్ విరుచుకుపడింది. ‘చాలామంది రాజకీయనాయకులు, దేశాధ్యక్షులు నిజమైన ఆధారాలు లేకుండానే నోటికొచ్చింది మాట్లాడుతుంటారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇమనె.
నిరుడు ప్రపంచ చాంపియన్‌షిప్స్ ముందు నిర్వహించిన ‘లింగ పరీక్ష'(Gender Test)లో ఇమనె ఫెయిల్ అయింది. ఆమెలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లక్షణాలు అధికంగా ఉండడంతో అమ్మాయిల విభాగంలో పోటీ పడేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. కానీ, ఐఓసీ(IOC) మాత్రం ఖెలెఫ్ను పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒలింపిక్స్‌లో 66 కిలోల విభాగంలో పోటీ పడిన ఇమనె తొలి బౌట్ నుంచే ప్రత్యర్థులను బెంబేలెత్తించింది.
This is so heartbreaking #boxing #OlympicGames #carina #angelacarini #imanekhelif pic.twitter.com/YamDFWboId
— Anabel Schunke (@ainyrockstar) August 1, 2024
ఏడు అడుగుల ఎత్తు ఉండే ఇమనె పంచ్ ధాటికి రింగ్‌లో ఎవరూ నిలువలేకపోయారు. అయితే.. 16వ రౌండ్ మ్యాచ్‌లో ఇమనె ఖెలిఫ్ కేవలం 46 సెకన్లలోనే ఇటలీ బాక్సర్‌ను యాంజెల కరిని(Angela Carini)ని ఓడించింది. దాంతో, రింగ్‌లో తనను ఓ అబ్బాయి కొడుతున్నాడని, ఖెలిఫ్ అమ్మాయి కాదని యాంజెల వాపోయింది. అంతేకాదు ఇక తాను ఫైట్ చేయలేనంటూ ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే.
‘పురుష బాక్సర్స అనే నిందతోనే పారిస్ ఒలింపిక్స్‌లో ఇమనె స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ డ్రెస్, రింగ్‌లో తన పంచ్ పవర్ చ చూసిన వాళ్లంతా తనను అబ్బాయే అనడం చూసి విసుగొచ్చిన ఆమె.. కొద్ది రోజులకే కొత్త లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పూల డిజైన్లతో కూడిన డ్రెస్ ధరించి మెడలో ఒలింపిక్ స్వర్ణాన్ని వేసుకొని ఇమనె ఓ నవ్వు విసురుతూ కెమెరాకు ఫోజిచ్చింది.
Algerian boxer Imane Khelif shows off dramatic new feminine makeover, days after winning gold at the Paris Olympics. pic.twitter.com/6nlFR9HSJr
— Oli London (@OliLondonTV) August 15, 2024
నిండైన జట్టును నుదిటికి ఇరువైపలా విప్పారదీసి.. చెవులకు పూల కొమ్మల్లాంటి జుంకాలతో ఇమనె చాలా స్టయిలిష్‌గా ఉంది. తనపై వస్తున్న వార్తలకు తాజా ఫొటోతో చెక్ పెడుతూ అందర్నీ షాక్‌కు గురి చేసింది ఇమనె. ఆ వీడియో ఊహించినట్టుగానే చాలావైరల్ అయింది.