కీవ్: రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు అణు బాంబు(Nuclear Weapon)లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రభుత్వ రిపోర్టు ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. చిన్నపాటి నాటు బాంబుల తరహాలో.. అణు బాంబులను తయారు చేసే పనిలో ఉక్రెయిన్ ఉన్నట్లు తెలుస్తోంది. 1945లో నాగసాకిపై అమెరికా జారవిడిచిన బాంబు లాంటి బాంబులను ఉక్రెయిన్ తయారు చేసే పనిలో పడింది. ఆ దేశం వద్ద ఉన్న ప్లుటోనియం నిల్వలను దీని కోసం వాడుకోనున్నది. ప్లూటోనియం ఆధారిత అణు బాంబులను అభివృద్ధి చేస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. అమెరికా సైనిక సాయం ఆగిన నేపథ్యంలో.. ఇలాంటి బాంబుల తయారీకి రంగం సిద్దం చేస్తున్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు. అయితే అణు బాంబులు తయారీ అవుతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ ఖండించింది. శక్తివంతమైన బాంబులు కాకున్నా.. కావాల్సిన పదార్ధం ఉన్నది కాబట్టి, శత్రు టార్గెట్లను ధ్వంసం చేసే రీతిలో ఆ బాంబులను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.