Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం చిరుగ్గా ఉండే ఈ వ్యాపార దిగ్గజం.. వినోదాత్మక వీడియోలతో పాటు ఆలోచన రేకెత్తించే పోస్ట్‌లు తరచూ షేర్ చేస్తుంటారు. కొత్త ప్రదేశాలు, సరికొత్త విషయాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా ఆవిష్కరిస్తుంటారు. తాజాగా ఓ ఆసక్తికర వీడియోతో ఆయన ఫాలోవర్స్ ముందుకు వచ్చారు.
బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఓ వీధి వ్యాపారి (street food vendor) ప్రత్యేకమైన ‘ప్రింటింగ్ మెషీన్’ (Printing Machine)తో దోశ (Dosa)లు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టా ఫుడ్ బ్లాగర్ దేవేష్ దబాస్ షేర్ చేసిన ఈ వీడియోలో.. సదరు వ్యాపారి ఓ మెషీన్లో దోశ బ్యాటర్ వేసి, కాస్త ఆయిల్, మసాలా స్టఫ్ పెడతాడు. అంతే నిమిషాల్లోనే దోశ రెడీ అయిపోతుంది. ప్రింటింగ్ మెషీన్లో పేపర్ బయటకు వచ్చినట్లు.. దోశ కూడా ఈ మెషీన్ నుంచి చుట్టుకుంటూ బయటకు వస్తుంది. ఈ వీడియో మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఇంకేముందు ఆ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి ఆయన ‘డెస్క్‌టాప్ దోశ’ అంటూ పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7
— anand mahindra (@anandmahindra) November 14, 2024
Also Read..
Russian Chef | పుతిన్‌ను విమర్శించిన రష్యన్ చెఫ్ అనుమానాస్పద మృతి..!
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపులు.. రాయ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్
Flights Delayed | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 300కిపైగా విమానాలు