Bomb Threat | ఇటీవలే దేశంలోని వందలాది విమానాలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపిన విషయం తెలిసింతే. తాజాగా మరో విమానానికి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా (Nagpur to Kolkata) వెళ్తున్న విమానానికి గురువారం ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని భావించారు. అధికారుల అనుమతితో విమానాన్ని రాయ్‌పూర్ (Raipur)కు దారి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేశారు (emergency landing). అనంతరం ప్రయాణికులనంతా దింపేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకొని విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో రాయ్‌పూర్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో అక్కడ విమాన రాకపోలకు కొంత అంతరాయం ఏర్పడింది.
Raipur, Chhattisgarh: A flight from Nagpur to Kolkata made an emergency landing at Raipur airport following a bomb threat. The plane is being checked at the airport and further probe is underway: SSP Santosh Singh
— ANI (@ANI) November 14, 2024
Also Read..
Air Pollution | ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో జనం విలవిల..
KTR | కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు..
Stock Market | నష్టాలకు బ్రేక్.. లాభాల్లో మొదలైన సూచీలు