Air Pollution | ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో జనం విలవిల..
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రారంతాలతో పాటు పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 473గా నమోదైంది.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రారంతాలతో పాటు పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 473గా నమోదైంది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దాంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులుపడ్డారు.
పెరిగిన వాయు కాలుష్యం నేపథ్యంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కండ్లలో మంటలు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు తదితర సమస్యలతో బాధపడుతున్నారు. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరగడంతో ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -3ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఇక అశోక్ విహార్‌లో గాణి నాణ్యత సూచీ 471 నమోదైంది.
ఆ తర్వాత అలీపూర్ 424, బవానా 456, చాందినీ చౌక్ 400, బురారీ 354, మధుర రోడ్ 399, ద్వారక 457, ఐజీఐ విమానాశ్రయం 436, జహంగీర్‌పురి 470, ఐటీఓ 423, లోధి రోడ్ 383, ముండ్కా 461, టెంపుల్ రోడ్ 441, ఓఖ్లా 441, పట్పర్గంజ్ 472, పంజాబీ బాగ్ 459, రోహిణి 453, వివేక్ విహార్ 470, వజీర్పూర్ 467, నజాఫ్‌గఢ్ 460గా రికార్డయ్యింది. గురువారం పలుచోట్ల పొగమంచు పేరుకుపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
సాయంత్రం, రాత్రిళ్లు సైతం మంచుదుప్పటి కప్పేస్తుందని తెలిపింది. నగరంలో గరిష్ఠంగా 29 డిగ్రీలు, కనిష్ఠం 16 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక బుధవారం ఢిల్లీ నగరంలో సూర్యుడి కిరణాలు సైతం కనిపించలేదు. మరో వైపు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

