Flights Delayed | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ తీవ్రమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 473గా నమోదైంది.
గురువారం ఉదయం రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. రోడ్లపై వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఉదయం 9 గంటల సమయంలోనూ సూర్యుడు కనిపించని పరిస్థితి. విజిబిలిటీ జీరోకు పడిపోవడంతో విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది (Flights Delayed).
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్కు రాకపోకలు సాగించే సుమారు 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ రాడార్ 24 (Flightradar 24) సంస్థ తెలిపింది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. మొత్తం ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, రాజధాని నుంచి బయలుదేరాల్సిన 226 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. సగటున 17 నుంచి 54 నిమిషాలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ పొగమంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
Also Read..
Sri Lanka | శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు.. బరిలో 8,821 మంది అభ్యర్థులు.. రేపే ఫలితాలు
Melania Trump | ఫస్ట్ లేడీగా మెలానియా ట్రంప్.. శ్వేత సౌధంలో మాత్రం ఉండకపోవచ్చు..!
Mumbai airport | ముంబై ఎయిర్పోర్ట్ను పేల్చేసేందుకు కుట్ర.. బెదిరింపు కాల్తో అప్రమత్తమైన అధికారులు