Sri Lanka | రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)లో నేడు పార్లమెంట్ ఎన్నికలు (parliamentary elections) జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
సెప్టెంబర్ 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయిన అనురా కుమార డిస్సనాయకే (Anura Kumara Dissanayake) ఈసారి ఆధిక్యాన్ని సాధించాలని భావిస్తున్నారు. మొత్తం 225 పార్లమెంట్ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతుండగా.. 8,821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 1.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కుతో ఎంపీలను ఎన్నుకోనున్నారు.
2022 ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, సాఫీగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం దాదాపు 90వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మొత్తం 13,314 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన అనంతరం కౌంటింగ్ చేపడతారు. శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది (Results Likely On Friday).
Also Read..
Mumbai airport | ముంబై ఎయిర్పోర్ట్ను పేల్చేసేందుకు కుట్ర.. బెదిరింపు కాల్తో అప్రమత్తమైన అధికారులు
Melania Trump | ఫస్ట్ లేడీగా మెలానియా ట్రంప్.. శ్వేత సౌధంలో మాత్రం ఉండకపోవచ్చు..!
Tulsi Gabbard | అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ హిందూ మహిళ.. ఎవరీ తులసీ గబ్బార్డ్..?