Tulsi Gabbard | అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ హిందూ మహిళ.. ఎవరీ తులసీ గబ్బార్డ్..?
Tulsi Gabbard | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వాకి తన కేబినెట్లో చోటు కల్పించారు. తాజాగా హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు.
Tulsi Gabbard | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వాకి తన కేబినెట్లో చోటు కల్పించారు. తాజాగా హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. తులసీ గబ్బార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ అభివర్ణించారు. తులసీ గబ్బార్డ్‌కు రెండు పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆమె మనల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తులసి గబ్బార్డ్ ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో భాగస్వాములయ్యారు.
తులసీ గబ్బార్డ్ ఎవరు ?
తులసి గబ్బర్డ్ దాదాపు రెండు దశాబ్దాలు యూఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్‌లో సేవలందించారు. ఇరాక్, కువైట్‌లోనూ పని చేశారు. అయితే, ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. తులసి గబ్బార్డ్ 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలు. ఆమెకు భారత్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. కానీ, ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు. దాంతో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. తులసి గబ్బర్డ్ సైతం హిందూ మతాన్ని విశ్వసిస్తారు. ఆమె పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు. 2020 సంవత్సరంలో తులసి గబ్బర్డ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. అయితే, మద్దతు లభించకపోవడంతో అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్‌ని సిద్ధం చేసింది తులసీ గబ్బార్డ్. 2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తులసి గబ్బర్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించిన సమయంలో.. ఆ సమయంలో కమలా హారిస్ సైతం రేసులో నిలిచారు. తులసి గబ్బార్డ్, కమలా హారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. ఇందులో తులసీ పేరు ప్రధానంగా వినిపించింది. గత ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్‌ను సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబ్బార్డ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల తర్వాత తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ట్రంప్ ఆమెను యూఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

