Melania Trump | ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ (Melania Trump) రెండోసారి అమెరికా ప్రథమ మహిళ (First Lady) హోదాను పొందనున్నారు. అయితే, ట్రంప్ పదవీకాల సమయంలో ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్.. వైట్‌హౌస్‌లో (White House) ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
2020లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాకు వెళ్లిపోయారు. గత నాలుగేళ్లుగా అక్కడే నివాసం ఉంటూ మంచి ఫ్రెండ్ సర్కిల్‌ను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇకపై కూడా ఎక్కువ సమయం ఫ్లోరిడాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అప్పుడప్పుడు మాత్రమే ఆమె శ్వేతసౌధానికి వస్తారని సమాచారం. ఫస్ట్‌లేడీ హోదాలో పెద్ద ఈవెంట్లు, ముఖ్య కార్యక్రమాలకు మాత్రమే అధ్యక్షుడితో కలిసి హాజరవుతారని ట్రంప్ ఎస్టేట్ మార లాగో వర్గాలను ఊటంకిస్తూ అమెరికా మీడియా పేర్కొంది. మిగతా సమయంలో ఫ్లోరిడా, న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో కొంతకాలం ఉంటారని నివేదించింది. మెలానియా కుమారుడు బారన్ ట్రంప్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఫ్లోరిడాతోపాటు న్యూయార్క్‌లో తన సమయాన్ని గడుపుతారని పేర్కొంది.
Also Read..
Donald Trump: శ్వేతసౌధంలో బైడెన్‌ను కలిసిన ట్రంప్.. 218 సీట్లు గెలిచిన రిపబ్లికన్ పార్టీ
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపులు.. రాయ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్
Air Pollution | ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో జనం విలవిల..