కేపీహెచ్బీ కాలనీ, జనవరి 30 : అల్లాపూర్ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao )అన్నారు. గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అల్లాపూర్ డివిజన్ ముస్లిం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలలో మౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేశామన్నారు.
అల్లాపూర్ డివిజన్లోని ముస్లిం శ్మశాన వాటికలలో(Crematorium) సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రేపు అధికారులతో కలసి శ్మశాన వాటికలను పరిశీలిస్తానని, ఆయా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్ధిన్, మైనార్టీ నేతలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..