Monalisa | మోనాలిసా భోస్లే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగిపోతోంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసలమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్ వచ్చింది. తాజాగా ఆమె తన తొలి చిత్రానికి సంతకం చేసింది.
‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ (The Diary of Manipur) చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లారు. తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. ఇక చిత్రీకరణకు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు (Amit Rao) నటిస్తున్నట్లు టాక్.
కుంభమేళాలో మోనాలిసా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనె కాళ్లు చూసి కొంతమందికి ముచ్చటేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆ ఫొటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి ఫిదా అయ్యారు.
Also Read..
“Mahakumbh | మహాకుంభమేళాలో పూసలమ్ముకునే అమ్మాయికి బాలీవుడ్ బంపరాఫర్!”
Maha kumbh | తొక్కిసలాట ఘటన మరవకముందే.. కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. కాలిపోతున్న టెంట్లు
Maha Kumbh Mela | మహాకుంభమేళా.. 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు