Mahakumbh | మహాకుంభమేళాలో పూసలమ్ముకునే అమ్మాయికి బాలీవుడ్ బంపరాఫర్!
Mahakumbh | మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చింది.
Mahakumbh | మహాకుంభమేళాలో ఒక యువతి సంచలనంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.. సోషల్‌మీడియాలోనూ ఆమెపైనే చర్చలు.. అలా అని ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల అప్సరస అంతకంటే కాదు.. చూడ్డానికి ఛామనఛాయ రంగులో ఉండే అత్యంత సాధారణ అమ్మాయి. పూసల దండలు అమ్ముకుని పొట్టబోసుకోవడమే ఆమె వృత్తి. అయినప్పటికీ ఆమె మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనే కళ్ళు.. అమాయకమైన చూపులు.. అవే ఇప్పుడు ఆమెను సోషల్‌మీడియా క్వీన్‌ను చేసింది. అంతేకాదు ఆ క్రేజ్‌నే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది.
మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా భోస్లే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనె కాళ్లు చూసి కొంతమందికి ముచ్చటేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆ ఫొటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి ఫిదా అయ్యారు.
A girl in Mahakumbh Mela is stealing the heart of the people😍
The girl whose name is Monalisa Bhonsle, came to Mahakumbh Mela in Prayagraj (UP) from Indore (MP) to sell her handmade garlands (Mala), has become an internet sensation because of her natural beauty. People are… pic.twitter.com/wj5sNaW1da
— Alok Ranjan Singh (@withLoveBharat) January 17, 2025
మోనాలిసాతో సెల్ఫీలు దిగేందుకు, ఆమెను ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు, వ్లాగర్లు ఎగబడుతున్నారు. ఆమె అందాన్ని పొగిడేస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా మొత్తమ్మీద మోనాలిసా ఇప్పుడు సెన్సేషన్‌గా మారడంతో బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి ఫిదా అయ్యానని సనోజ్ మిశ్రా తెలిపారు. డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని.. తన సినిమాలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సరిగ్గా సెట్ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొందరలోనే ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి మోనాలిసాను కలుస్తానని చెప్పారు. ఆమెకు యాక్టింగ్ నేర్పించి మరి తన సినిమాలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

