Minister Kumaraswamy | విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు.. పునరుద్దరణకే ప్రాదాన్యం : కేంద్ర మంత్రి కుమారస్వామి
Minister Kumaraswamy | విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరుగదని కేంద్ర ఉక్కు గనులశాఖ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. ప్లాంట్‌ను పునరుద్దరించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
అమరావతి : విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను (Visakha Steel Plant) ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరుగదని కేంద్ర ఉక్కు గనులశాఖ మంత్రి కుమారస్వామి (Minister Kumaraswamy) మరోసారి స్పష్టం చేశారు. ప్లాంట్‌ను పునరుద్దరించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
ఇటీవల కేంద్రం విశాఖ స్టీల్‌కు ప్యాకేజీ (Package) ప్రకటించిన అనంతరం తొలిసారిగా విశాఖకు వచ్చిన మంత్రి కుమారస్వామితో పాటు మరో మంత్రి శ్రీనివాస వర్మకు ( Srinivas Varama) ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఇద్దరు మంత్రులు, ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు.
దాదాపు నాలుగు గంటలకు పైగా సంబంధిత అధికారులు, కార్మికులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ప్యాకేజీతో ప్లాంట్ సమర్ధ నిర్వహణ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కుమార స్వామి మాట్లాడారు.
2030లోపు విశాఖ ప్లాంట్ 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి (Steel Production) సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) తమకు లక్ష్యంగా నిర్దేశించారని వివరించారు. ప్రస్తుతం 35వేల కోట్ల అప్పులుగా ఉన్న ప్లాంట్‌ను పరిరక్షించేందుకు తాము అధికారంలోకి రాగానే రెండు విడతలుగా ఆర్థిక సహాయం అందజేసామన్నారు. జులైలో ప్లాంట్‌ను సందర్శించిన తరువాత ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని, పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
రూ. 11,440 కోట్లు ప్యాకేజీ
మొదటి, రెండు విడతలుగా విడుదల చేసిన నిధులతో బ్లాస్ట్ ఫర్నేస్ (Blast Farnes) మొదలు పెట్టాం , దీంతో ఉద్యోగులు, కార్మికులు సమర్దవంతంగా పనిచేయడంతో కేంద్రం మరో రూ. 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చింది. ఇచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు చేసి స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి గురువారం సందర్శించామని తెలిపారు. వచ్చే జూన్, జులైలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్మికుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించబోం
ఈ సంవత్సరాంతంలోగా ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్మికుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించబోమని అన్నారు. ప్లాంట్‌ను ఎలాగైనా పరిరక్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. సెయిల్‌లో కలపడమా, ప్రభుత్వ పరంగా నడపడమా అనేది భవిష్యత్‌లో తెలుస్తుందని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

