Champions Trophy | పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ జరుగనున్నది. అంతకు ముందు 16న లాహోర్‌లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభోత్సవానికి హాజరవుతాడా? లేదా తెలియాల్సి ఉంది. సమాచారం మేరకు.. బీసీసీఐ రోహిత్‌ను లాహోర్‌కు పంపేందుకు అవకాశం లేదని తెలుస్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్, ఫొటోషూట్ కోసమైనా లాహోర్‌కు వస్తారా ? లేదా అన్న విషయంలో ఐసీసీ, పీసీబీ స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.
ఫిబ్రవరి 19న కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ ముందు షెడ్యూల్ చేసిన కార్యక్రమాల జాబితాకు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 7న గడాఫీ స్టేడియాన్ని పీసీబీ పునః ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి షాబాజ్ ఫరీఫ్‌ను, 11న కరాచీలో నేషనల్ స్టేడియం పునః ప్రారంభోత్సవానికి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని అతిథిగా ఆహ్వానించారు. ఫిబ్రవరి 16న లాహోర్‌లో జరిగే కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్, ఫొటోషూట్ కోసం పీసీబీ, ఐసీసీ షెడ్యూల్‌ను రూపొందించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం చారిత్రాత్మక లాహోర్ కోటలోని హుజురి బాగ్‌లో జరుగుతుంది. బోర్డుల అధికారులు, ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులను ఆహ్వానించనున్నారు.
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన మొదటి లీగ్ దశ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఆ తర్వాత టీమిండియా జట్టు వారం పాటు విరాం దొరుకుతుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. భారత జట్టు చివరిసారిగా 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. 2002లో వర్షం కారణంగా ఫైనల్ రద్దయ్యింది. ఆ సమయంలో భారత్, శ్రీలంక జట్లను సంయుక్తంగా విజేతలుగా నిలిచాయి. భారత జట్టు మొత్తం నాలుగు సార్లు ఫైనల్‌కు చేరింది. 2000, 2017లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొననుండగా.. మొత్తం 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి మ్యాచులను పాకిస్తాన్, దుబాయి ఆతిథ్యం ఇస్తాయి. భారత జట్టు అన్ని గ్రూప్ దశ మ్యాచులు దుబాయిలోనే జరుగుతాయి. అయితే, మిగిలిన జట్ల మ్యాచ్‌లు పాకిస్తాన్లో మాత్రమే జరుగుతాయి. ఈ టోర్నమెంట్ 19 రోజుల పాటు కొనసాగుతుంది. పాకిస్థాన్‌లోని రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తాయి. పాకిస్తాన్‌లోని ప్రతి మైదానంలో మూడు గ్రూప్ మ్యాచులు జరుగుతాయి. భారత్‌లోనే పాల్గొనే మూడు గ్రూప్ మ్యాచ్‌లు, మొదటి సెమీ ఫైనల్ దుబాయిలో జరుగుతాయి.
చాంపియన్స్ ట్రోఫీలో మూడు నాకౌట్ మ్యాచులకు రిజర్వ్ డే ఉంటుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు రెండింటికీ రిజర్వ్ డే ఉంటుంది. దుబాయిలో మొదటి సెమీ ఫైనల్, లాహోర్‌లో రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. భారత్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే మార్చి 9న జరిగే ఫైనల్‌కు సైతం లాహోర్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ అర్హత సాధిస్తే మాత్రం దుబాయి వేదికగా జరుగుతుంది. ఇది పాకిస్థాన్‌కు ఇబ్బందికరమే.
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ
Shardul Thakur: మేఘాలయాతో రంజీ మ్యాచ్.. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్