గాలే: శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ చేశాడు. అతను 232 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా తాజా సమాచారం ప్రకారం 143 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 600 రన్స్ చేసింది. శ్రీలంకలో సచిన్ చేసిన డబుల్ సెంచరీ రికార్డును ఖవాజా బ్రేక్ చేశాడు. 2010లో సచిన్ 37 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 347 బంతుల్లో 203 రన్స్ చేశాడు. అయితే ఖవాజా 38 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ చేయడం విశేషం. 15 ఏళ్ల క్రితం సచిన్ నమోదు చేసిన ఓల్డెస్ట్ ప్లేయర్ రికార్డును ఖవాజా బ్రేక్ చేశాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ స్కోర్ చేసిన తొలి ఆసీస్ బ్యాటర్‌గా కూడా ఖవాజా నిలిచాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున మైఖేల్ స్లేటర్ అత్యధికంగా 219 రన్స్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డును ఖవాజా దాటేశాడు.
A statement knock!
Usman Khawaja brings up a magnificent double hundred 👏 #WTC25 | 📝 #SLvAUS: https://t.co/8NKpfnNf96 pic.twitter.com/xx40MCXu2u
— ICC (@ICC) January 30, 2025