హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందు బాబులు(Drug lords) రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఓ జేసీబీకి(JCB)నిప్పు పెట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పరపల్లిలో గల సాయి బాబా దేవాలయం సమీపంలో పార్కింగ్‌లో ఉన్న జేసీబీని మందు బాబులు తగలబెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, మద్యం మత్తులో ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ పెంచి ఇలంటి సంఘటనలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట