Harish Rao | మైనింగ్ చట్టం ప్రకారం.. MDL లైసెన్స్ లేకుండా క్వారీ చేస్తే మొదటిసారి రూ.10 వేలు, రెండోసారి కూడా పట్టుబడితే రూ.25 వేల జరిమానాతో పాటు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించాలి. రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడింది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది..? ఆ కంపెనీ పట్ల ఎందుకింత ప్రేమ..? ఇప్పటివరకు మీరు తీసుకున్న కఠిన చర్యలు ఏంటో సమాధానం చెప్పాలి.. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు.
పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు.. తన స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగిందని చెప్పి, రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పార్టీ మంత్రులకు ఒక న్యాయం ఉంటుందా..? ముఖ్యమంత్రేమో మూసీలో కాలుష్యం జరగవద్దు అంటారు. కానీ ఇక్కడ మైనింగ్ అధికారులే.. రాఘవ కన్స్ట్రక్షన్స్ వల్ల మూసీ నది కాలుష్యానికి, గండిపేట్, హిమాయత్ సాగర్ లో కాలుష్యానికి కారణం అవుతుంది అని లిఖితపూర్వకంగా రాశారు.
దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. మైనింగ్ శాఖ మంత్రి మాట్లాడుతూ.. రాఘవ కన్స్ట్రక్షన్కు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం..? అని అడుగుతున్నారు. గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై మేము ట్విట్టర్ లో పెడితే.. మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి ‘నాపై మొరిగే కుక్కలను గొలుసు కట్టి ఎలా కట్టేయాలో మాకు బాగా తెలుసు’ అని మాట్లాడారు. సంబంధం లేకపోతే మీరెందుకు భుజాలు తడుముకున్నారు..? మంత్రి పొంగులేటి తక్షణమే నైతికంగా రాజీనామా చేసి, విచారణ ఎదుర్కోవాలన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి..
నిన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, మేం చేస్తే తప్పేంటి..? అన్నట్లు మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. మీరు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు.. మీ చేతుల్లో పవర్ ఉంది ఎంక్వయిరీ చేసుకోండన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓబులాపురం మైన్స్పై ఆరోపణలు వస్తే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హౌస్ కమిటీ వేసి, ఆరోపణలు చేసిన నాగం జనార్దన్ రెడ్డినే ఆ కమిటీకి చైర్మన్‌గా వేశారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాను. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఈ కుంభకోణంతో మీకు సంబంధం లేకపోతే.. ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయండి..లేదా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు, ఆయన గతంలో మాతో కలిసి పని చేశారు. కానీ ఒక తప్పు జరిగినప్పుడు.. ఆ తప్పును ఆధారాలతో సహా బయటకు తీయడం, రాష్ట్ర ఖజానాను కాపాడటం ప్రతిపక్షంగా మా బాధ్యత అని అన్నారు.
‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య