Akbaruddin Owaisi | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని, రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి పేర్కొన్నారు. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు చోటు చేసుకున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం కానీ వాళ్లు రాత్రి పూట సామాన్యుల మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారు. దీంతో హత్యలు పగటిపూట జరుగుతున్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో ఆస్పత్రులకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల మీద కూడా పోలీసులు విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ పోలిసింగ్ లేదు. కనిపించిన వారిని కనిపించినట్టే కొడుతున్నారు. క్రిమినల్స్‌ను మాత్రం పట్టుకోవడం లేదు. వారిని శిక్షించడం లేదు. గంజాయి, డ్రగ్స్ తరలిస్తున్న వారి పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సామాన్యులపై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నారని ఓవైసీ తెలిపారు.
హైదరాబాద్‌లో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయి. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పాను. ఈ లంచాలపై ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలి. విచ్చలవిడిగా గంజాయి సేవిస్తూ చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించండి. అసలు హైదరాబాద్‌లో ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ అని అక్బరుద్దీన్ ఓవైసీ రేవంత్ సర్కార్‌ను నిలదీశారు.
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి అన్నారు.. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు అయ్యాయి.
టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం కానీ వాళ్లు రాత్రి పూట సామాన్యుల మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు.
హైదరాబాద్… https://t.co/T78oJG1egS pic.twitter.com/uEESoWoiM8
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024
ఇవి కూడా చదవండి..
Crop Loans | రేపు రెండో విడుత రుణమాఫీ ప్రారంభం.. ఈ సారైనా అర్హులందరికీ మాఫీ అయ్యేనా..?