Dharmapuri Arvind | ఇటీవలే తెలంగాణ పర్యటన సందర్భంగా హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్టేజ్‌పై సీఎం రేవంత్ రెడ్డిని చూస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యారని తెలిసిందే. రేవంత్ రెడ్డి మీరు మాతో కలవండి.. పదేళ్లలో గుజరాత్‌కు ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు ఇచ్చేందుకు మేం రెడీగా ఉన్నట్టు చెప్పారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో తాజాగా ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కామెంట్స్ సరికొత్త చర్చకు తెరలేపాయి.
మొన్న మోదీ చెప్పిండు నాతో కలువు అని సీఎం రేవంత్ రెడ్డితో చెప్పిండు. మరి ఏమన్నా ఇద్దరికి లింక్ ఉందేమో నాకైతే తెలవదు.. నేను బీజేపీలో చాలా చిన్న కార్యకర్తను. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి లాగా కలుస్తారేమో, అందుకే నాతో కలిసి పనిచెయ్ అని మోదీ రేవంత్ రెడ్డితో అన్నాడు కావొచ్చు. మా నాయన మీ పార్టీ (కాంగ్రెస్)కి చాలా సేవ చేసిండు. పారదర్శకంగా జీవితాంతం కాంగ్రెస్‌లో ఉండి మాట మీద ఉండే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , శ్రీధర్ బాబు లాంటోళ్లనో సీఎం చేసుకున్నా అయిపోవు. ఆయనకు ఏదో ఒక మంత్రి ఇస్తే సరిపోవు అంటూ కామెంట్ చేశారు. ప్రధాని మోదీ కామెంట్స్‌పై సొంత పార్టీ ఎంపీనే చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపుతున్నాయి.
రేవంత్ రెడ్డికి మోడీకి ఏమన్నా లింక్ ఉందేమో
బెంగాల్లో సువేందు అధికారి లాగా కలుస్తారేమో, అందుకే నాతో కలిసి పని చెయ్ అని అన్నాడు కావొచ్చు
– బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ https://t.co/e0htdlpHRs pic.twitter.com/ZfBz2lV4yG
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026
Watch: గన్ గురిపెట్టి జ్యుయలరీ షాపులో దోపిడీకి యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే?
Road accident | రోడ్డు పక్కన రాతి గోడను డీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
జూలూరుపాడులో ఘనంగా ‘టూ కే రన్’