హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు(Double bedroom houses) ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఓ దుండగుడు పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే..గచ్చిబౌలి (Gachibowli)టీఎన్జీవోస్ కాలనీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీస్‌లో పని చేస్తున్నానని, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తానని 22 మంది వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.50 వేలు చొప్పున వసూలు చేశాడు.
దాదాపు రూ.10 నుంచి 15 లక్షల రూపాయల వసూళ్లు చేసినట్లు సమాచారం. అయితే బాధితులు పలుమార్లు నాగరాజుకు ఫోన్ చేయగా ఆఫీసులో ఉన్నాను.. కలెక్టరేట్లో ఉన్నాను అంటూ బకాయిస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాయర్ రామచంద్రరావుతో కలిసి.. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
KTR | తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకే.. ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చాం: కేటీఆర్