Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి ఓ లేఖ రాశారు. నా దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం సరికాదు. నాకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపారని మంత్రి కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం కాబట్టి క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రుల రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించే విధంగా కడియం శ్రీహరికి మార్గదర్శకాలు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్‌కు విరుద్ధమంటూ రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మూడు పేజీల లేఖ రాశారు.
కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
నా దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం సరికాదు
నాకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపాడు
ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం కాబట్టి… https://t.co/uTpnzalpnV pic.twitter.com/05q1OQqfmD
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026