జూబ్లీహిల్స్,జనవరి7 : హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు (Voters)ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాలో 3,89,954 మంది ఓటర్లతో జూబ్లీహిల్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 2,03,137 మంది పురుషులు, 1,86,793 మంది మహిళలు, 24 మంది థర్డ్ జెండర్ ఓటర్లు నమోదయ్యారు. జూబ్లీహిల్స్ తరువాత రెండు స్థానాల్లో యాకుత్పురా అసెంబ్లీ నియోజకవ ర్గంలో 3,66,130 మంది, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,65,183 మంది ఓటర్లు నమోదయ్యారు.
గతంలో కూడా ఓటర్ల సంఖ్యలో జిల్లాలో టాపర్గా ఉన్న జూబ్లీహిల్స్ 2025 లో తన స్థానాన్ని పదిలపరుచు కుంది. జిల్లాలో చార్మినార్ నియోజకవర్గంలో అత్యల్పంగా 2,32,515 మంది ఓటర్లు నమోదయ్యారు. కాగా ,ఎన్నికల సంఘం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెల 1 వ తేదీతో 18 ఏండ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఏడాది నాలుగు సార్లు ఓటరు నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో స్థానిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య మరింత పెరగనుంది.
ఇవి కూడా చదవండి..
HMPV | హెచ్ఎంపీవీ కలకలం.. ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండిలా..!
Harish Rao | మొట్టమొదటి హామీకే దిక్కు లేకుండా పోయింది..! కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్రావు ఫైర్