Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. ఈ గ్యారెంటీల అమలుకు నోచుకోకపోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్ అయ్యారు.
2024 డిసెంబర్ 9వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేఎంఎం ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం మాయీ సమ్మాన్ పథకం కింద నెలకు రూ. 2,500 మహిళలకు ఇస్తున్నారని హరీష్ రావు గుర్తు చేశారు.
2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేసిన 125 ఏళ్ల పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెల రూ. 2500 ఇస్తామని చెప్పిన మొట్టమొదటి హామీకే దిక్కులేకుండా పోయింది! ఇది షేమ్ అంటూ హరీష్‌రావు విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ
KTR | నా మాటలు రాసిపెట్టుకోండి.. రేవంత్ సర్కార్ కక్ష సాధింపులపై కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్!
BRS | కేటీఆర్‌పై ఈ అక్రమ కేసులు ఎందుకో తెలుసా?