KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పుబట్టింది. కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలకు బయటపెడుతూ ప్రజా గొంతుకగా నిరంతరం నిగ్గదీసి ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్‌పై కక్షగట్టారని విమర్శించింది. అక్రమ కేసులతో అడ్డుకట్ట వేసేందుకు గుంపు మేస్త్రీ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడింది. రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఈ పోరాటం ఆగదని స్పష్టం చేసింది. నీ అవినీతి, అక్రమాలపై చీల్చి చెండాడుతూనే ఉంటామని పేర్కొంది.
కేటీఆర్‌పై ఈ అక్రమ కేసులు ఎందుకో తెలుసా? అంటూ పలు కారణాలు బీఆర్ఎస్ తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పోస్టు చేసింది. ఆ కారణాలేంటంటే..
– ఆరు గ్యారెంటీల సంగతేందని ప్రశ్నించినందుకు
– లగచర్లలో గిరిజన రైతులకోసం లడాయి చేసినందుకు
– మూసీ హైడ్రా బాధితులకు అండగా నిలబడినందుకు
– సీఎం బావమరిది అమృత్ టెండర్ల గోల్ మాల్ పై ప్రశ్నించినందుకు
– అదానీ – రేవంత్ చీకటి ఒప్పందలను బయటపెట్టినందుకు
– నిరుద్యోగుల నిరసనకు మద్దతు తెలిపినందుకు
– రైతన్నలకు, నేతన్నలకు తోడుగా పోరాడినందుకు
– గురుకుల విద్యార్థుల విషాహార విషాదాలపై నిలదీసినందుకు
– ఆటో అన్నలకు సంఘీభావంగా కొట్లాడినందుకు
కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడుతూ ప్రజా గొంతుకగా నిరంతరం నిగ్గదీసి ప్రశ్నిస్తున్నందుకే, @KTRBRS గారిపై కక్ష గట్టి, అక్రమ కేసులతో అడ్డుకట్ట వేసేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్న గుంపు మేస్త్రి.
రేవంత్.. నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా..
నీ అవినీతి, అక్రమాలపై చీల్చి… pic.twitter.com/4pJCkuXqCr— BRS Party (@BRSparty) January 7, 2025
క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్ టీమ్‌లో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్లో కోరింది.