HMPV | హైదరాబాద్ : హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ కేసులు నమోదు అవుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడంతో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా హెచ్ఎంపీవీ వైరస్ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే దానిపై డాక్టర్లు పలు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ వైరస్ను ఎదుర్కోవాలంటే మన మెనూలో స్వల్ప మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. డైట్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్కు గురైన త్వరగా కోలుకోనే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు.
యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే ఉసిరి, ఆరెంజ్, నిమ్మ, రెడ్ పెపర్ తీసుకోవాలి. ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్, నిమ్మలో కూడా విటమిన్ సీతో పాటు ప్లావినాయిడ్స్, లిమోనాయిడ్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రెడ్ పెప్పర్లో విటమిన్ సీ, విటమిన్ బీ6, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.
పసుపు, అల్లం, దాల్చిన చెక్క కూడా వైరల్ ఇన్ఫెక్షన్లకు మంచి మెడిసిన్గా పని చేస్తాయి.
విటమిన్ డీ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. చేపలు, మష్రూమ్స్(పుట్టగొడుగులు), పాల ఉత్పత్తులు కూడా మంచివి. రెండు రోజులకు ఒకసారి దానిమ్మ తింటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళ గ్రీన్ టీ సేవించొచ్చు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మొట్టమొదటి హామీకే దిక్కు లేకుండా పోయింది..! కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్రావు ఫైర్
KTR | కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ