KTR | రేవంత్ రెడ్డి కొత్త డైలాగ్ నేర్చుకున్నడు.. నేను మారిన మనిషిని.. మారిపోయిండట.. కరెక్టే మారిపోయినవ్. ఎన్నికల ముందు దానవీర శూరకర్ణ ఏది కావాలంటే అది ఇస్తా అన్నడు.. కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు కుంభకర్ణ లేస్తలేడు మారిపోయిండు మనిషి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్లో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పాలమూరు బిడ్డ.. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి ఏం లాభం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి. నీ నాగర్కర్నూల్లో పాలమూరులో ఇయ్యళ్ల రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే సిగ్గనిపస్తలేదా..? బాధనిపిస్తలేదా.. ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
గురుకుల పాఠశాలలను మేం ఆనాడు బ్రహ్మాండంగా నడిపితే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో 140 మందిపిల్లలు గురుకులాల్లో చనిపోయారు. సిగ్గనిపిస్తలేదా..? కరెంట్ ఇయ్యలేకపోతున్నవ్.. రైతు బంధు పడతలేదు సిగ్గనిపిస్తలేదా..ఝ రైతుల ధాన్యం రోడ్లపై తడిసి రైతులు ఏడుస్తుంటే బాధనిపిస్తలేదా..? అని ప్రశ్నించారు. మేము ప్రజల పక్షాన తిడుతుంటే ఆయనకు పైశాచిక ఆనందం వస్తుందట.. నాకు ఏమనాలో అర్థం కావడం లేదు.
రేవంత్ రెడ్డి దగ్గర కూర్చున్న కుక్క కూడా లేవదు..
మనం చివరకు కేసీఆర్ వస్తడు లే.. చేయి ఊపుతడు.. మేం కూడా చేయి ఊపుతం.. కేటీఆర్ మధ్యలో వస్తడు.. ఆయన కూడా థంబ్ చూపిస్తడు.. మేం కూడా చూపిస్తం.. కానీ మేం మాత్రం ఏం చేయం అంటే కుదరదు. దయచేసి మా మిత్రులను కోరుతున్న. మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే మీ మండలాలో ఉండే సమస్యలు, రైతులై కావొచ్చు.. కులవృత్తులే కావొచ్చు. లేదా ఇతరులై కావొచ్చు.. లేదా విద్యార్థులై కావొచ్చు. వాటిని ఎత్తుకోండి.. వాళ్ల తరపున కదం తొక్కండి.. రోడ్డెక్కండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి టైం ఇచ్చేకాడికి టైం ఇచ్చినం. మనం కూడా ఓపిక పట్టినం.. రెండున్నరేళ్లు సరిపోయింది. 50 శాతం అయిపోయింది. ఇంకో రెండేళ్ల గడ్డుకాలం అని ఓ సోదరుడు అన్నడు.. రెండేళ్లు ఏం లేదు.. ఇంకో సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర కూర్చున్న కుక్క కూడా లేవదు.. నిలబడదు. అధికారులు మాట వినరు. ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎన్నికలే. కాబట్టి ఇంకొక్క సంవత్సరం తట్టుకోవాలే. ఈ దుర్మార్గ అరాచక పాలన.. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో సత్తా ఏందో చూపెట్టాలే. ఖచ్చితంగా గళం విప్పాలే.. బలం చూపాలే. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం తొక్కినమో ఇప్పుడు కాంగ్రెస్ కబంధ హస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పుకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీదున్నదని దిశానిర్దేశం చేశారు.
నేను మారిన మనిషి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
అవును నువ్వు మారిన మనిషివే.. ఎన్నికల ముందు దాన వీర శూర కర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ
మా తిట్లు వింటుంటే ఆయనకు పైశాచిక ఆనందం వస్తుందంట.. ఆయనని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు – కేటీఆర్ pic.twitter.com/dlsDZVhYmT
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2026