బచ్చన్నపేట, ఏప్రిల్ 29 : ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి మండిపడ్డారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పేరుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు వ్యతిరేక విధానాలే అవలంభిస్తుందన్నారు. ఐదు సార్లు వేయాల్సిన రైతు బంధు రెండుసార్లు వేసి చేతులు దులుపుకుందన్నారు.
ఎరువుల కోసం రైతులు నానా తండాలు పడేలా చేసిందని విమర్శించారు. ఎంతో ఆర్భాటంతో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా దాన్యం పేరు పోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే, జనగామ జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెట్కూరి రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుక్కల బాల కిషన్, మాజీ సర్పంచులు భవాని, తాతి రెడ్డి శశిధర్ రెడ్డి, సార్ల కిష్టయ్య, రైతులు రవీందర్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, బుచ్చయ్య, యాదగిరి, ఎల్లారెడ్డి, రవి, సుమన్, మహేష్, మధు, మహేష్, సంతోష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.