Bomb Threat Mails: గురుగ్రామ్ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్
Bomb Threat Mails: గురుగ్రామ్‌లో ఇవాళ అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బెదిరింపు మెయిల్స్ రాగానే స్కూళ్లలోనే తక్షణమే ఎమర్జెన్సీ ప్రోటోకాల్ పాటించారు. అనేక స్కూళ్ల హాలీడే ప్రకటించాయి. పిల్లలను తీసుకెళ్లాలని పేరెంట్స్‌కు మెసేజ్ చేశాయి.
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో ఇవాళ అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్(Bomb Threat Mails) వచ్చాయి. బెదిరింపు మెయిల్స్ రాగానే స్కూళ్లలోనే తక్షణమే ఎమర్జెన్సీ ప్రోటోకాల్ పాటించారు. అనేక స్కూళ్లు హాలీడే ప్రకటించాయి. పేరెంట్స్‌కు మెసేజ్ చేశాయి. పిల్లలను తీసుకెళ్లాలని ఆ మెసేజ్‌లో కోరాయి. స్కూళ్ల వద్ద భారీ సంఖ్యలో పేరెంట్స్ చేరుకున్నారు. బాంబు బెదిరింపులు వచ్చిన స్కూళ్ల వద్దకు బాంబు డిస్పోజ్ స్క్వాడ్లు చేరుకుని తనిఖీ చేస్తున్నాయి. శ్రీ రామ్, ఆమిటీ, హెచ్డీఎఫ్ స్కూళ్లలకు ఇవాళ ఉదయం 8.33 నిమిషాలకు ఈమెయిల్స్ వచ్చాయి. అయితే ఆ సమయానికి విద్యార్థులు స్కూళ్లకు రావడం ప్రారంభమైంది. బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సుమారు 10 స్కూళ్లు ఇవాళ పోలీసులను ఆశ్రయించాయి. అన్ని స్కూళ్లలోనూ పోలీసులు సెర్చ్ చేస్తున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

