హైదరాబాద్ : రైలు(Train )కిందపడి ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి(Inter student commits suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి అనే విద్యార్థిని ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..