Jurala Project | దెబ్బతిన్న జూరాల క్రస్ట్ గేట్లు.. భారీగా లీకవుతున్న నీళ్లు
ఓ వైపు కృష్ణా నదిలో నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్.. మరో వైపు ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో వృధాగా కృష్ణమ్మ దిగువకు పోతున్నది. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల డ్యామ్ (Jurala Project) నుంచి నీరు లీక్ అవుతున్నది. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో తుప్పు పట్టి, రబ్బర్లు ఊడిపోయాయి. దీంతో మొత్తం 12 క్రస్ట్ గేట్ల నుంచి నీరు దిగువకు పోతున్నది.
మహబూబ్‌నగర్: ఓ వైపు కృష్ణా నదిలో నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్.. మరో వైపు ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో వృధాగా కృష్ణమ్మ దిగువకు పోతున్నది. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల డ్యామ్ (Jurala Project) నుంచి నీరు లీక్ అవుతున్నది. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో తుప్పు పట్టి, రబ్బర్లు ఊడిపోయాయి. దీంతో మొత్తం 12 క్రస్ట్ గేట్ల నుంచి నీరు దిగువకు పోతున్నది. ఇందులో 8 గేట్ల రోప్ దెబ్బతిన్నది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జూరాల ప్రాజెక్టును 1995లో ప్రారంభించారు. 9.68 టీఎంసీల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు జలాశయం నిండు కుండలా ఉంది. అయితే పాలకుల నిర్లక్ష్యం ప్రాజెక్టును వెంటాడుతున్నది. క్రస్ట్ గేట్లకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో తుప్పుపట్టి గేట్లకు అమర్చిన రబ్బర్లు ఊడిపోయాయి. దీంతో ఆ ప్రాతంలో నీరు లీకవుతుండటంతో క్రమంగా ప్రాజెక్టు ఖాలీ అతువున్నది. వేసవి నాటికి పరిస్థితి ఇలాగే కొనసాగితే జూరాలపై ఆధారపడిన ప్రజలకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

