Jeevan Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో కలిసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని జగిత్యాలలోని నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగినా, తెంచుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్తో కలిసి పని చేసే అవకాశం లభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందన్నారు.
ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరమవుతడని ఎవరూ ఊహించలేదు. దానిక్కి కారణాలు కూడా మీరు ఊహించి ఉంటరు. గత 20 మాసాల నుంచి నేను ఎదుర్కొంటున్న మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా తట్టుకోని నిలబడ్డా.. కానీ రాష్ట్ర భవిష్యత్ కూడా ప్రధానమన్నారు.
ఆనాడు 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరికి కూడా ఏముంటదంటే ఇంకా మెరుగైన పాలనా కావాలి అనుకుంటాం. కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వ కాలంలో తెలంగాణ సమాజానికి కల్పించిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల కంటే మెరుగైన పాలన కావాలని కాంగ్రెస్కు ప్రజలు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ ప్రభుత్వాన్ని చూశా. కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలోనే పదేళ్లలో అందించిన సంక్షేమ ఫలాలు తిరోగమన దిశకు వెళ్లాయి. కేసీఆర్ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు వారు ఉద్యమించారో వారి సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి కృష్టి చేస్తే కేవలం రెండేళ్లలోనే తిరోగమనం అయ్యేలా చేశారన్నారు.
ఇది నా జీవితంలోనే సంతోషమైన రోజు
కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు లభిస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
నేను ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయ్ భాస్కర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు చూసా.. కానీ రెండు సంవత్సరాల కాలంలోనే 10 ఏండ్లలో సాధించిన అభివృద్ధి అంతా పోయింది… pic.twitter.com/l7sLcxyn6B
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2026