Arshdeep Singh : సినిమా తారలతో క్రికెటర్లు ప్రేమలో పడడం కొత్తేమీ కాదు. భారత మాజీ కెప్టెన్లు, మాజీ ఆటగాళ్లలో కొందరు హీరోయిన్లపై మనసు పారేసుకోగా.. ప్రస్తుతం ఆడుతున్న కుర్రాళ్లలో కొందరు అందగత్తెలతో ప్రేమాయాణం నడిపిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఇషాన్ కిషన్(Ishan Kishan) తన ప్రేయసితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండగా అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సైతం ప్రేమ జపం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఓ పంజాబీ నటితో ఈ యార్కర్ కింగ్ రొమాన్స్‌లో చేస్తున్నాడని టాక్. ఇంతకూ ఈ అమ్మాయి పేరేంటి? ఆమె ప్రత్యేకలు ఏంటీ? వంటి విషయాలు చూద్దాం.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్రధాన పేసరైన అర్ష్‌దీప్ సింగ్ కూడా సహచరుల మాదిరిగానే ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఇటీవల అతడు పంజాబీ నటి చేతిలో చేయి వేసిన ఫొటోను పంచుకున్నాడు. అదే సమయంలో ఆమె మైదానంలో ప్రత్యక్షమైంది. పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి స్టాండ్స్‌లో తళుక్కుమంది. దాంతో.. అర్ష్‌దీప్ మనసు గెలిచిన ఆ సుందరి ఎవరు? అని అభిమానులు నెట్టింట తెగ వెతుకున్నారు.
🚨 RUMOURS ALERT 🚨
Arshdeep Singh posted two stories on Snapchat where he’s seen holding a girl’s hand.
Fans noticed the “੧” tattoo, which matches Samreen Kaur, who is also the ex of Ashish Chanchlani.
Is Arshdeep dating Samreen Kaur? 👀 pic.twitter.com/dEGw3Gkq1t
— Mention Cricket (@MentionCricket) April 5, 2026
ఇంతకూ ఆమె పేరు ఏంటంటే.. సమ్రీన్ కౌర్(Samreen Kaur). వర్ధమాన నటి అయిన సమ్రీన్ సంగీతం వీడియోలు, ఫొటోలు పంచుకుంటుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన నటన, వ్యక్తిగత జీవితం, వృత్తిగత అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే.. అటు అర్ష్దీప్గానీ, ఇటు సమ్రీన్గానీ తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేయలేదు. వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేదా.. జస్ట్ డేటింగ్ చేస్తున్నారా? అనే విషయంపై స్పష్టత లేదు. దాంతో.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో తమ రిలేషన్షిప్ గురించి చెప్పకపోతారా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Arshdeep Singh was already taking wickets, and now he’s stealing hearts too?
Recently, Arshdeep Singh shared a photo on his Snapchat where he was seen holding a “mystery girl’s” hand. Fans noticed that the “੧” (Ik Onkar) tattoo on the girl’s finger in the photo is identical to… pic.twitter.com/zdGgzWDGRs
— Cricket Central (@CricketCentrl) April 6, 2026