AP News | మద్యం రవాణా కుంభకోణం కేసు.. అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
AP News | ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. అదేవిధంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
AP News : ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. అదేవిధంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే అంబటి రాంబాబు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాను రేపు విచారణకు రాలేనని తెలియజేశారు. తాను 15 రోజుల క్రితం గుండెకు స్టంట్లు వేయించుకున్నానని, డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపారు.
పూర్తిగా కోలుకున్న తర్వాత ముందుగా సమాచారం ఇచ్చి విచారణకు వస్తానని, తప్పనిసరిగా సహకరిస్తానని అంబటి ఈడీకి మెసేజ్ పంపారు. అయితే ఆయన సమాధానంపై ఈడీ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదే కేసులో ఈరోజు మర్రి సుబ్బారెడ్డి, పురుషోత్తమరావుల వాంగ్మూలాలను ఈడీ నమోదు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు లిక్కర్ రవాణా కోసం సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు గుర్తించారు.
తొలి కాంట్రాక్టు కాలంలో వీరిద్దరూ కలిసి సుమారు 59.14 లక్షల మద్యం పెట్టెలు రవాణా చేశారని అధికారులు గుర్తించారు. సిగ్మా సంస్థ నుంచి రూ.15.44 కోట్లు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సబ్కాంట్రాక్టులు, నిధుల మళ్లింపు, అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపై కూడా వారిని వివరాలు అడిగారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను అధికంగా పెంచడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఈడీ లెక్కలు చూపిస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

