అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ ( Selfie ) పిచ్చిలో ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ముగ్గురు మృతి చెందారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూలగుమ్మి జలపాతం ( Waterfal l) వద్ద గురువారం మధ్యాహ్నం నలుగురు యువతులు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి కొట్టుకుపోయారు.
వీరిలో త్రిష ( 17 ), రత్నకుమారి ( 16), పవిత్ర (16 ) అనే ముగ్గురు మృతి చెందగా అంజలి అనే మరో యువతిని స్థానికులు కాపాడారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను లుంగపర్తి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను చూసి బోరున విలపించారు.