హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ(Endowment Department) భూములు కబ్జా కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో(Rajendranagar) కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నాలుగు ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్లు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు.
పలు సార్లు నోటీసులు జారీ చేసినా ఎవరు స్పందించకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు జేసీబీలతో అక్రమంగా వెలసిన షెడ్డులను తొలగిస్తున్నారు. దీంతో స్థానికులకు,చ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అధికారుల బృందం అక్రమకట్టడాలను తొలగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాయర్ రామచంద్రరావుతో కలిసి.. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
KTR | తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకే.. ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చాం: కేటీఆర్