HYDRAA | తుర్కయంజాల్, ఫిబ్రవరి 9 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో ప్లాటను కబ్జా చేసి రియల్టర్ నిర్మించిన ఫామ్ హౌస్‌ను ఆదివారం హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ మధ్య కూల్చివేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ సర్వే నెంబర్ 951లో 7 ఎకరాల 28 గుంటల భూమిని 1986లో 200 ప్లాట్స్ చేశారు. అయితే 2013లో సంరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి వెంచర్ చేసిన భూమిని తిరిగి అగ్రికల్చర్ భూమిగా మార్చుకొని సుమారుగా 80 ప్లాట్లను కబ్జా చేసి ఇటీవల ఫామ్ హౌస్‌లు నిర్మించాడు. దీంతో ప్లాట్ల యజమానులు ఈ నెల 3వ తేదీన హైడ్రా అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ భూమికి సంబందించిన పత్రాలు పరిశీలించి సంరెడ్డి బాల్ రెడ్డి కబ్జాకు పాల్పడింది నిజమే అని ధ్రువీకరించి ఆదివారం ఫామ్ హౌస్‌లను కూల్చివేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Soil Mafia | కందుకూరులో యథేచ్ఛగా మట్టి మాఫియా.. రాత్రయ్యిందంటే వందల టిప్పర్లు రోడ్డుపైకి!
Hyderabad | మీర్‌పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. భార్యను చంపింది గురుమూర్తి ఒక్కడే కాదు!