హైదరాబాద్ : అత్తాపూర్ మొగల్ కా నాలా, ధూల్‌పేట్(Dhoolpet) ప్రాంతంలో రూ. 46 లక్షల విలువ చేసే హషీష్ అయిల్, గంజాయిని (Ganja)పట్టుకున్నట్లు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ జాయిట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. ఎక్సైజ్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీలోని కడపకు చెందిన సాధిక్ వలీ, రంపచోడ వరానికి చెందిన హరికుమార్, సత్యనారాయణ అనే ముగ్గురు హైదారాబాద్‌కు 4.2కిలోల హషీష్ అయిల్ను సరఫరా చేస్తుండగా ఉండగా మొగల్‌కా నాలా వద్ద పట్టుకున్నామని పేర్కొన్నారు.
వారిని విచారిస్తున్న క్రమంలో రాజమండ్రిలో మరింతగా గంజాయి ఉన్నట్లు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని పంపించి అక్కడి నుంచి 70.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. హషిష్, గంజాయి విలువ రూ. 46 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?