KTR | కొట్లాడాలి కొట్టాడాలి.. అంటేనువ్వు కత్తేమో వానికిచ్చినవ్.. యుద్ధం నన్ను చేయమంటున్నవ్.. ఇదెక్కడి కథ అనిపిస్తదా..? అనిపియ్యదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గెలిపించిన కసిరెడ్డి నారాయణ ఏం చేస్తుండు… రెండో స్థానంలో వచ్చిన ఆచారి ఏం చేస్తుండు. ఇటు కేంద్రప్రభుత్వం అటు రాష్ట్రప్రభుత్వం ఉంది కదా.. మరి మీరు కూడా మమ్మల్ని వద్దనుకుంటిరి కదా..కొన్నికానీ చూద్దామని మనుకు కూడా అనిపియ్యాలే కదా…
కొత్తగా అధికారం వచ్చింది కదా వాళ్లు.. మనమెందుకు ఆతృత పడ్డట్టు, కంగారు పడ్డట్లు.. వాళ్లకు అధికారమొస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నట్టు ఆగమాగమైపోతున్నట్టు మనమెందుకుండాలే. తెలిసి రానీ అని మాకు కూడా అనిపించందన్నారు. అందులో తప్పేముంది. నిజంగా రైతు బంధు మంచిగా పడుతుంటే అర్థం కాలేదన్నారు కేటీఆర్ . రైతు బంధు మంచిగ పడుతుంటే ఎవరుంటే ఏంది తీయ్ అనుకున్నారు. ఐదెకరాల పొలముంటే కేసీఆర్ రాకముందు మొత్తానికి ఎకరానికి రూ.20 లక్షలుండేది మొత్తంకోటి రూపాయలు.. కానీ కేసీఆర్ వచ్చినంక ఆ కోటి రూపాయల విలువ 5 కోట్లు అయింది. అంటే సంపద పెరిగినంక మనిషిలో ధీమా పెరుగుతది. దేశమంతటా గత్తర వచ్చినట్టు వచ్చిందికరోనా. మూతికి బట్టలు కట్టుకుని ఇంట్లోకెళ్లి ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్తితి వచ్చింది. అప్పుడేం అనిపిస్తది మనిషికి. ఎక్కడో ఒకదగ్గర ఆలోచన వస్తది. అయ్యో నేను చచ్చిపోతే నా పెళ్లాం పిల్లల పరిస్థితి ఏంటి.. తల్లిదండ్రుల పరిస్థితి ఏంది.. వాళ్లను ఎవడు చూసుకుండడు.. ఏమైతనే భయం ప్రతీఒక్కరిలో ఉంటది.. నాకేమన్నా అయితే ఎట్లా..అని ఉంటుంది.రూ.5 కోట్ల విలువ ఉంటే ఒక ధీమా ఉంటది.. నాకేమైనా అయినా మావోళ్లు ఎలాగైన బతుకతరు అనిపిస్తది..
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎన్నికలు రాగానే ప్రజలు అయోమయానికి గురికావొద్దు. గందరగోళంలో ఓటేస్తే ఆగం అవుతారని కేసీఆర్ చెప్పారు. అధికారం రావడం పోవడం రోటీన్‌గా జరిగేదే. పాలమూరు బిడ్డను, ప్రజల గోస తీరుస్తానని రేవంత్ చెప్పారు. రెండున్నరేళ్లు అయిపోయింది ఒక్కసారి ప్రజలు ఆలోచించండని సూచించారు. రెండున్నరేళ్లలో పాలమూరుకురేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ ఏం చేశారు.. రేవంత్ ఏం చేశారో బేరీజు వేసుకోండన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. 420 హామీలతోప్రజలను కాంగ్రెస్‌లా కేసీఆర్ మోసం చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టుకుండానే రైతుబంధు తెచ్చారు. 11 విడతల్లోరూ.73వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. రైతు బంధు కేసీఆర్ ఇంట్లకెళ్లి ఇచ్చారా..అనికొందరు మాట్లాడారు..?మరి ఇవాళ రైతు బంధు పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.