Traffic Jam | హైదరాబాద్ : హుస్సేన్ సాగర్‌లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంకా కొన్ని వందల గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు బారులు తీరాయి. దీంతో ఖైరతాబాద్, లక్డీకాపూల్, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. ఇక గణనాథుల నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
గ్రేటర్లో సాఫీగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 1,02,510 గణనాథుల విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 71 ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులో 26,546 విగ్రహాలు, ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో 4,730, నెక్లెస్ రోడ్డు 2,360, పీపుల్స్ ప్లాజా 5,230, అల్వాల్ కొత్త చెరువులో 6,211 విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Govt Schools | చాక్‌పీసులకూ డబ్బుల్లేవ్..! రాష్ట్రంలో గాడి తప్పిన పాఠశాలల నిర్వహణ
Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో తొలి విడుత ఎన్నికలు ప్రారంభం.. 24 నియోజకవర్గాలకు పోలింగ్
TTD | నేడే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల