Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏడు జిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు తొలి విడుతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మరాజ్ రీజియన్లోని అనంత్ నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాలు, చీనాబ్ లోయలోని డోడా, కిశ్త్ వాద్, రాంబన్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్పుర, జైనాపుర, షోపియాన్, డీహెచ్ పుర, కుల్గాం, దేవ్సర్, దూరు, కోకెర్నాగ్, అనంత్ నాగ్ వెస్ట్, అనంత్ నాగ్, శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్సీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది.
#WATCH | J&K: A long queue of voters witnessed at a polling booth in Pulwama, as they await their turn to cast a vote.
Polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins. pic.twitter.com/HcGIS0gtoA
— ANI (@ANI) September 18, 2024
#WATCH | J&K: A long queue of voters witnessed at a polling booth in Doda, as they await their turn to cast a vote.
National Conference has fielded Khalid Najib from the Doda seat, BJP has fielded Gajay Singh Rana, Congress fielded Sheikh Riaz and Democratic Progressive Azad… pic.twitter.com/khrt14aYRm
— ANI (@ANI) September 18, 2024
ఇవి కూడా చదవండి..
రైతులకు రేవంత్ బాకీ 25వేల కోట్లు..! ఈ బాకీని ఎప్పుడు చెల్లిస్తారోనని రైతులు ఎదురుచూపు..!!
MAL Blood Group | కొత్త బ్లడ్ గ్రూప్ ‘మాల్’..50 ఏండ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు