ఒక దేశం ప్రగతి దిశగా పయనిస్తున్నదా? పతనం వైపు పురోగమిస్తున్నదా? అని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రమాణాలున్నాయి. గతంలో ప్రతీ విషయాన్ని ఆర్థిక అంశాలతో ముడిపెట్టి చూసేవారు. కానీ, ఇప్పుడు ప్రగతిని కొలిచే పద్ధతి మారింది. ఎక్కడ మనిషి మంచి విద్య, వైద్యం పొందగలుగుతున్నాడు? తదితర అంశాల ఆధారంగా ఐరాస పలు దేశాలకు రేటింగ్ ఇస్తున్నది. 193 ఈ జాబితాలో మనది 134వ స్థానం కావడం శోచనీయం.
మానవ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ దిశగా పాలన ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు అత్యున్నత జీవన ప్రమాణాలతో జీవించాలని ఆయన తపించారు. ఆ తపనలోంచి పుట్టిన కార్యక్రమాలే రెసిడెన్షియల్ స్కూళ్లు, మిషన్ భగీరథ, శాంతిభద్రతల పరిరక్షణ, అంగన్వాడీల్లో పౌష్ఠికాహారం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచడం.
ప్రజా వైద్యాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దితే ఆరోగ్య తెలంగాణను సాధించవచ్చనేది కేసీఆర్ భావన. మన దేశంలో ప్రజలకు సరిపడా వైద్యులు, వైద్య కళాశాలలు లేవు. ఉన్న కొన్ని మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటువే. ఆస్ట్రేలియాలో ప్రతీ వెయ్యి మందికి 5.5, బ్రిటన్‌లో 3.2, అమెరికా, చైనాలో 2.6 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. కానీ, మన దేశంలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. అదీ కూడా ఒక్క అల్లోపతిలో కాదు, వివిధ రంగాల్లో కలిపి ఈ సంఖ్య ఉన్నది. అందుకే, తెలంగాణ ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలందించాలనే సంకల్పంతో 2014లోనే కేసీఆర్ సిద్ధం చేశా రు. తత్ఫలితంగానే నేడు దేశంలో అత్యుత్తమ ప్రజావైద్యం అందుతున్న మొదటి మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
ఇక వైద్య కళాశాలల విషయానికి వస్తే.. బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఓ స్వర్ణయుగం. దేశంలో మరెక్కడా లేనివిధంగా, కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాకో వైద్య కళాశాలను మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌ది. తాజాగా 4 వైద్య కళాశాలలకు అనుమతి రావడంతో వాటి సంఖ్య 34కు చేరింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రాంతంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉం డేవి. ఈ సంఖ్యను పెంచాలని అసెంబ్లీలో, బయటా మేం ఎంత మొత్తుకున్నా ఫలితం లేదు. నాలుగు జిల్లాలున్న రాయలసీమలో నాలుగు మెడికల్ కాలేజీలు, 9 జిల్లాలున్న ఆంధ్రలో 7 మెడికల్ కాలేజీలుండేవి. కానీ, పది జిల్లాలున్న తెలంగాణలో మరో మూణ్నాలుగు మెడికల్ కాలేజీలు పెట్టాలని మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, దానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నిక కావడంతో మెడికల్ కాలేజీల కల నెరవేరింది. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యం, విద్యలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ కేంద్రం ఏ మాత్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పా టుచేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా, మనకు ఒక్కటీ ఇవ్వకపోవడం గర్హనీయం.
తెలంగాణ ముందు 70 ఏండ్ల లో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే, తొమ్మిదేండ్ల స్వయం పాలనలో 29 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేస్తూ తెలంగా ణ ప్రభుత్వం దేశంలోనే రికార్డు సృష్టించింది. 2014 నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లుండగా, నేడు వాటి సంఖ్య 4,090కి పెరిగింది. ఏటా పది వేల మందికి పైగా తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ తయారైంది. తెలంగాణ చేసిన ఫలితంగా నేడు దేశంలో జనాభా, వైద్యుల మధ్య నిష్పత్తి తగ్గింది.
మెడికల్ కళాశాలలు మాత్రమే కాదు, వాటికి అనుబంధంగా అన్ని కూడిన స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా అందుబాటులోకి వచ్చాయి. పడకల సామర్థ్యం గల ప్రభుత్వ ఆసుపత్రులు అనేక జిల్లాల్లో ఇప్పటికే నడుస్తున్నా యి. 60-100 మంది వర కు వైద్యులు అందుబాటులో ఉన్నారు. అన్ని రకాల వైద్య సేవలందుతున్నాయి. డయాలసి స్, డయాగ్నస్టిక్, క్యాన్సర్, మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నా యి. ప్రతీ జిల్లా కేంద్రంలోనూ ఇలాంటి ఆసుపత్రి అందుబాటులో ఉండటం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు వంద కిలోమీటర్ల లోపే మెరుగైన వైద్యాన్ని ఇది తెలంగాణ సాధించిన గొప్ప వైద్య విజయం.
కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి ఇటీవల అనుమతులు లభించడం సంతోషకరం. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో అనుమతి పొందిన ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ ప్రాంత ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైంది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలి క సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు జారీచేసింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే ఎన్ఎంసీ నుంచి గత నెల అనుమతులు లభించా యి. నిబంధనల ప్రకారం మౌలిక వసతుల ఏర్పాటు, బోధనా సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైందనే కారణంతో ఎన్ఎం సీ అనుమతులు నిరాకరించింది. జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని మౌలిక వసతులు, బోధన సిబ్బందిని సమకూర్చుకుంటామని అనుమతి కోరుతూ కేంద్రానికి అప్పీల్ చేసింది. దీన్ని పరిశీలించిన కేంద్రం ఆ 4 మెడికల్ కాలేజీలకు అనుమతు లివ్వాలని ఎన్ఎంసీకి మార్గనిర్దేశం చేసింది. దీంతో ఒక్కో కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం నాలుగు కాలేజీల్లో 200 సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి కొత్త సీట్లతో కలుపుకొ ని తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మొత్తం సీట్ల సంఖ్య 4,090కు చేరుకున్నది. తొమ్మిదేండ్లలో ఆ సంఖ్యను కేసీఆర్ సర్కార్ 5 రెట్లు పెంచింది. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పదివేల మందికి పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 22 సీట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలవడం గర్వకారణం. పేద ప్రజల చెంతకే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పాటు, మన బిడ్డలు వైద్య విద్య చదివే అవకాశాలను కేసీఆర్ గణనీయంగా పెంచారు.
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మకమైన పురోగతిని సాధించింది. అరవై ఏండ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్దంలోనే ఆవిష్కరించింది. తెలంగాణ పిల్లలు వైద్యవిద్య కోసం లక్షలు ఖర్చుచేసి చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థులు మాతృభూమికి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఒకవైపు ఎం బీబీఎస్ చదవాలనే ఆశ, మరోవైపు అర్థం కాని భాష, దేశం కాని దేశంలో గోస. ఇదం తా ఒకనాడు. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు, లోకల్ రిజర్వేషన్ వల్ల డాక్టర్ చదవాలనుకునేతెలంగాణ విద్యార్థులకు అవకాశా లు పెరిగాయి. శ్వేత విప్లవం, హరిత విప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవాలకు నిలయంగా మారిన తెలంగాణ, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ విప్లవానికి నాంది పలికింది. ఇక్కడ ఎంబీబీఎస్ చదివినవారు రాష్ట్ర ప్రజలకే కాదు, వివిధ దేశాల్లోనూ సేవలందించబోతున్నారు. తద్వారా తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేయబోతున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా, వైద్య విద్య హబ్‌గా ఎదిగిందని చెప్పేందుకు గర్వపడుతున్నాను. పెరిగిన మెడికల్ సీట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ కావాలనే తమ కలను సాకారం చేసుకోవాలి. మెడికల్ కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిసారించాలని, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది కొరత లేకుండా చూడాలి. అంతేకాదు, ఏటా ఎన్ఎంసీ అనుమతులు (రెన్యువల్) కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా వైద్య విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
-తన్నీరు హరీశ్‌రావు
(వ్యాసకర్త: వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు)