హైదరాబాద్ : హాష్ ఆయిల్(Hash oil) విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు సభ్యుల ముఠాను బాలానగర్(Balanagar) ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమన్, లాలు, విజయ్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.6 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హాష్ ఆయిల్ విలువ సుమారు 13.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.