IND vs NZ 3rd Test : వాంఖడేలో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ (Newzealand) మూడో సెషన్లోనే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేయగా టీ తర్వాత కాసేపటికే కివీస్ కుప్పకూలింది. రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81)లు తిప్పేయగా 250 లోపే పర్యాటక జట్లు ఇన్నింగ్స్ ముగిసింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డారిల్ మిచెల్(82)ను ఔట్ చేసిన సుందర్.. అజాజ్ పటేల్(7)ను ఎల్బీగా వెనక్కి పంపి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దాంతో, కివీస్ 235 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది.
తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న న్యూజిలాండ్ బ్యాటర్లు వాంఖడేలో విఫలమయ్యారు. టాపార్డర్ విఫలమమ్వగా.. డారిల్ మిచెల్(82), విల్ యంగ్ (71) లు అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. అయితే.. రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81)లు తమ మ్యాజిక్ చూపిస్తూ కివీస్ బ్యాటర్లను వణికించారు.
Innings Break!
Solid bowling display from #TeamIndia! 💪 💪
5⃣ wickets for Ravindra Jadeja
4⃣ wickets for Wahsington Sundar
1⃣ wicket for Akash DeepScorecard ▶️ https://t.co/KNIvTEy04z#TeamIndia | #INDvNZ | @imjadeja | @Sundarwashi5 | @IDFCFIRSTBank pic.twitter.com/H91914qtgt
— BCCI (@BCCI) November 1, 2024
టీ బ్రేక్ తర్వాత మిచెల్ ధాటిగా ఆడాడు. సుందర్‌ను టార్గెట్ చేస్తూ సిక్సర్లు బాదాడు. అయితే.. అతడి బౌలింగ్‌లోనే స్లిప్‌లో రోహిత్ శర్మకు సులువైన క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు. అదే ఓవర్లో అజాజ్ పటేల్(7) సిక్సర్ బాదేసి.. ఎల్బీగా వెనుదిరిగడంతో కివీస్ 235 పరుగులకు ఆలౌటయ్యింది.
లంచ్ తర్వాత జడేజా చెలరేగాడు. క్రీజులో పాతుకు పోయిన యంగ్, మిచెల్ల జోడీని విడదీశాడు. నాలుగో వికెట్‌కు 75 రన్స్ జోడించి విల్ యంగ్(71)ను బోల్తా కొట్టించాడు. అదే ఓవర్లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్(0)ను కూడా ఔట్ చేసి పర్యాటక జట్టును ఒత్తిడిలో పడేశాడు. అంతేనా.. మరికాసేపట్లో టీ అనగా గ్లెన్ ఫిలిఫ్స్(3)ను కూడా బౌల్డ్ చేసిన జడేజా న్యూజిలాండ్‌ను ఆలౌట్ ముంగిట నిలిపాడు. అయితే.. మిచెల్ పట్టుదలగా ఆడి జట్టు స్కోర్ 200 దాటించాడు. టీ తర్వాత మళ్లీ బంతి అందుకున్న జడేజా.. మ్యాట్ హెన్రీని బౌల్డ్ చేసి 14వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.