England Cricket Board : ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించింది. తద్వారా జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లకు రెండేండ్ల, వార్షిక ప్రతిపాదికన ఈసీబీ జీతాలు చెల్లించనుంది. టీ20, వన్డే సారథి జోస్ బట్లర్ (Jos Buttler)తో పాటు టెస్టు జట్టు నాయకుడు బెన్ స్టోక్స్ (Ben Stokes) రెండేండ్ల కాలానికి బోర్డుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తంగా 29 మందితో ఇంగ్లండ్ బోర్డ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.
ఏడుగురికి రెండేండ్ల పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. 19 మంది క్రికెటర్లు వార్షిక కాంట్రాక్ట్ సొంతం చేసుకోగా.. మరో ముగ్గురు యువ ఆటగాళ్లు ఇంగ్లండ్ డెవలప్మెంట్ పేరిట కాంట్రాక్ట్ సాధించారు. ఇంతకుముందు స్టోక్స్ ఏడాది కాంట్రాక్ట్ మాత్రమే తీసుకున్నాడు. మరోవైపు బట్లర్ రెండు సంవత్సరాల పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ మీద సంతకం చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరితో ఈసీబీ రెండేండ్ల పాటు ఒప్పందం చేసుకుంది. ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ సైతం రెండేండ్ల పాటు జాతీయా జట్టుకు ఆడేందుకు సిద్దమయ్యాడు.
A total of 29 players have been awarded Central Contracts 📝🦁🏴
— England Cricket (@englandcricket) October 31, 2024
ఆల్రౌండర్ విల్ జాక్స్, ఓపెనర్ ఫిల్ సాల్ట్, స్పిన్నర్ షోయబ్ బషీర్, పేసర్ ఓలీ స్టోన్లకు కూడా 2 ఏండ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. యువ క్రికెటర్లు జాకబ్ బెథెల్, జాన్ టర్నర్, జోష్ హల్లు ఇంగ్లండ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు సంపాదించారు.