IND vs NZ 3rd Test : మూడో టెస్టులో భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. భారత సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా(3/53) ధాటికి కివీస్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఆదిలో వాషింగ్టన్ సుందర్(2/50) న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెట్టగా.. లంచ్ తర్వాత జడ్డూ తన జాదూ చూపించాడు. ఒకే ఓవర్లో క్రీజులో పాతుకుపోయిన విల్ యంగ్(71)ను, టామ్ బ్లండెల్(0)ను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. అనంతరం డారిల్ మిచెల్(53 నాటౌట్) సాధికారికంగా ఆడి హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దాంతో, టీ సమయానికి కివీస్ 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
బెంగళూరు, పుణే టెస్టుల్లో గెలుపొంది జోరుమీదున్న న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు చెక్ పెట్టారు. వాంఖడేలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌ను ఆకాశ్ దీప్ దెబ్బకొట్టాడు. డెవాన్ కాన్వే(4)ను ఎల్బీగా ఔట్ చేసి చేసిన ఆకాశ్ భారత్‌కు బ్రేకిచ్చాడు. అనంతరం సుందర్ తన మ్యాజిక్ చూపిస్తూ డేంజరస్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5)లను వెనక్కి పంపాడు. అంతే.. 72 వద్ద కివీస్ మూడు వికెట్లు పడ్డాయి. ఆ దశలో యువ ఆటగాడు విల్ యంగ్(71), డారిల్ మిచెల్(53 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. దాంతో, 92-3తో న్యూజిలాండ్ లంచ్‌కు వెళ్లింది.
Jaddu’s double strike 🔥
via @BCCI | #INDvNZ pic.twitter.com/PlOmTh0MCN
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2024
భోజన విరామం తర్వాత కూడా యంగ్, మిచెల్‌లు భారత బౌలర్లను విసిగించారు. నాలుగో వికెట్‌కు 70కి పైగా రన్స్ జోడించి న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడదీశాడు. ఒకే ఒకే ఓవర్లో విల్ యంగ్(71)ను, టామ్ బ్లండెల్(0)ను ఔట్ చేసి పర్యాటక జట్టును ఒత్తిడిలో పడేశాడు. మరికాసేపట్లో టీ అనగా గ్లెన్ ఫిలిఫ్స్(3)ను కూడా బౌల్డ్ చేసిన జడేజా న్యూజిలాండ్‌ను ఆలౌట్ ముంగిట నిలిపాడు.