ISRO | లేహ్‌లో తొలిసారిగా అనలాగ్ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో.. ఇక్కడ ఏం చేస్తారంటే..?
ISRO | భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్ చేపట్టింది.
ISRO | భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్ చేపట్టింది. మిషన్‌లో భాగంగా ఇస్రో లేహ్‌లో ఓ స్పేస్‌ను సృష్టిస్తుంది. ఇందులో మరో గ్రహంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. దాంతో భూమికి దూరంగా ఉన్న ప్రదేశాల్లోని బేస్ స్టేషన్లలో ఎదురయ్యే సన్నాహాలను ఎదుర్కొనేందుకు ఇస్రో సన్నాహాలు చేయనున్నది.
ఇస్రో లేహ్‌లో ప్రారంభించిన తొలి భారీ అనలాగ్ మిషన్ మిషన్ ఇదే. అంతరిక్షం, ఏదైనా ఖగోళ వస్తువు తరహాలో వాతావరణం, పర్యావరణాన్ని పోలి ఉంటుంది. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు తీర్చిదిద్దుతుంటారు. అందులో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలకమైన మిషన్లు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో కీలకమైన మిషన్ గగన్‌యాన్. ఇందులో మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపబోతున్నది.
ఈ పరిస్థితుల్లో అనలాగ్ మిషన్ కీలకంగా మారనున్నది. రాబోయే కాలంలో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. లద్దాఖ్‌లోని వాతావరణ పరిస్థితులు కొంత వరకు చంద్రుడు, మార్స్ పరిస్థితులను పోలి ఉంటాయి. చల్లని, పొడి వాతావరణం, ఎక్కువ ఎత్తు ఉండడంతో ఇక్కడి నుంచి దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం సన్నాహాలకు ఉపయుక్తంగా ఉండనున్నది. అనలాగ్ మిషన్‌లో పాల్గొనేవారంతా ఇతర గ్రహాలు, స్పేస్‌షిప్‌ల్లో ఉండే పరిస్థితులు అనుభవిస్తారు. భవిష్యత్‌లో ఇక్కడే అంతరిక్ష యాత్రకు సిద్ధం కానున్నారు. నిర్వహణ, మానసిక స్థితిని సైతం శాస్త్రవేత్తలు పర్యవేక్షించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Analog Space Mission
- India
- ISRO
- Leh
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

