జిన్నారం, మార్చి 7: రాత్రి సమయంలో ఏటీఎంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. సీఐ రవీందర్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం గడ్డపోతారంలోని వక్రాంజీ ఫ్రాంచైజీ గల ఏటీఎం ఉంది. గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు ఏటీఎం చోరీకి యత్నించారు. ఇద్దరు వ్యక్తులు ఏటీఎం లోపలికి వెళ్లి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్‌ను పగటగొట్టారు. మిషన్‌లో ఉన్న రూ. 1.43లక్షల నగదును అపహరించారు. ఏటీఎం మిషన్ పగిలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, సీఐ రవీందర్‌రెడ్డిలు సందర్శించారు. క్లూస్, ఫింగర్ ప్రింట్స్ టీం నమూనాలను సేకరించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ రవీందర్‌రెడ్డి తెలిపారు. చోరీకి పాల్పడ్డ వ్యక్తులు సీసీ కెమెరాల్లో నమోదయ్యారని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.