IPL Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యువ క్రికెటర్ల పంట పండింది. తమ ప్రతిభతో ఫ్రాంచైజీ యజమానుల మనసు గెలిచిన కుర్రాళ్లకు జాక్‌పాట్ తగిలింది. అవును.. రిటైన్ జాబితాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యువకెరటాలు రికార్డు ధర దక్కించుకున్నారు. సీనియర్లను కాదని మరీ ఫ్రాంచైజీలు భావి తారలకే జై కొట్టాయి. దాంతో గత సీజన్లో లక్షల్లో పలికిన వాళ్లంతా ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. ఏకంగా వెయ్యి రెట్లు అత్యధికంగా ఆర్జించనున్నారు. ఇంతకూ వాళ్లు ఎవరో తెలుసా..? రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్. జూనియర్ మలింగ, రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్, సాయి సుదర్శన్, శశాంక్ సింగ్, రింకూ సింగ్.
ఐపీఎల్లో నిలకడగా రాణించిన యువ క్రికెటర్ల కష్టం వృథా కాలేదు. ఫ్రాంచైజీలు వాళ్లకు తగిన న్యాయం చేస్తూ రికార్డు ధర ఆఫర్ చేశాయి. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అయితే ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వేతనాన్ని ఏకంగా వెయ్యి రెట్లు పెంచేసింది. గత సీజన్లో 20 లక్షలే పలికిన అతడికి ఇప్పుడు రూ.14 కోట్లు ఇవ్వనుంది. దాంతో, 17వ సీజన్‌తో పోల్చితే జురెల్ ఆదాయం 6,900 శాతం పెరిగింది.
Jurel & Rinku: Roof-breaking salary hikes 📈#IPL2025 | @starsportsindia pic.twitter.com/6E7Hk6Z4kw
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2024
జూనియర్ మలింగగా పేరొందిన మథీశ పథిరణను మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద మొత్తంతో రిటైన్ చేసుకుంది. 17వ సీజన్లో పథిరణకు రూ.20 కోట్లు ముట్టజెప్పిన సీఎస్కే ఇప్పుడు అతడికి రూ.13 కోట్లు చెల్లించనుంది. అంటే.. అతడి ఆదాయం ఏకంగా 6,400 శాతం పెరిగింది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు రజత్ పాటిదార్, లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్‌ల ఆదాయం సైతం 5,400 శాతం పెరగడం గమనార్హం.
The wait is over and the retentions are 𝙃𝙀𝙍𝙀! 🔥
Here are all the players retained by the 🔟 teams ahead of the #TATAIPL Auction 💪
What do you make of the retention choices 🤔 pic.twitter.com/VCd0REe5Ea
— IndianPremierLeague (@IPL) October 31, 2024
ఓపెనర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నసాయి సుదర్శన్ (Sai Sudarshan)కు గుజరాత్ టైటాన్స్ ఏకంగా 4,150 శాతం వేతనం అంటే.. రూ.8.50 కోట్లు ఆఫర్ చేసింది. పంబాబ్ కింగ్స్ యువ కెరటం శశాంక్ సింగ్‌పై కూడా కోట్ల వర్షం కురిసింది. నిరుడు వేలంలో రూ.20 లక్షలు పలికిన శశాంక్‌ను పంజాబ్ రూ.5.50 కోట్లకు అట్టిపెట్టుకుంది.
— IndianPremierLeague (@IPL) October 31, 2024
సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ (Rinku Singh) ఆదాయం కూడా అమాంతం పెరిగింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూను తొలి ప్రాధాన్య క్రికెటర్‌గా రిటైన్ చేసుకోవడంతో పాటు రూ.13 కోట్లు ఇస్తోంది. గత ఎడిషన్‌లో రింకూకు కోల్‌కతా రూ.55 లక్షలు మాత్రమే చెల్లించింది. అప్పటితో పోల్చితే ఈ సిక్సర్ల కింగ్ సంపాదన 2,264 శాతం పెరిగింది.